వైభవంగా ఆంజనేయస్వామికి అభిషేకం

తాండూరు మండలం మాదారం టౌన్షిప్ శ్రీకోదండ రామాలయంలో గురువారం ఆంజనేయస్వామికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. వేద పండితుడు, ఆలయ అర్చకులు ముద్దు అవధూత శర్మ ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములతో అభిషేకం, ఆకు పూజ, అష్టోత్తరం పూజ కార్యక్రమం జరిపించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ నామస్మరణతో ఆలయ ఆవరణ మారుమ్రోగింది. అభిషేక కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు. మహిళలు, భక్తులు పాల్గొన్నారు.