సింగరేణిని పరిరక్షించేది బీఎంఎస్ మాత్రమే
సింగరేణిని పరిరక్షించే ధైర్యం BMSకి మాత్రమే ఉన్నదని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య వెల్లడించారు. ఆర్జీ 3 ఏరియాలో ఏఎల్పీ, అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ బాగుండాలంటే కార్మిక చైతన్యం తప్ప మార్గం లేదని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో విచ్చవిడిగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ అవినీతిని అంతం చేయాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. సింగరేణి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్, బొగ్గు బకాయిలు 25,000 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. సింగరేణి సంస్థ మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత సీఅండ్ఎండీదేన్నారు. పెండింగులో ఉన్న కార్మిక సమస్యలను సైతం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కేసీఆర్ వ్యక్తి గత అవసరాల కోసం సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు అప్రమత్తంగా ఉండి ఈ చర్యలను అర్ధం చేరుకోవాలని కోరారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపైన ఉన్నదని మరోమారు స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం రేపటి భావితరాల భవిష్యత్ కోసం కార్మికుల ప్రయోజనాల కోసమే BMS పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో RG3ఉపాధ్యక్షుడు అరుకాల ప్రసాద్,బ్రాంచ్ సెక్రెటరీ మామిడి స్వామి అనుప రమేష్,పెద్దోళ్ల ఐలయ్య,ఉప్పులేటి శ్రీనివాస్, గోగుల విద్యాసాగర్, రామంచ సంపత్,వల్లెపు సురేష్, బండారి శ్రీనివాస్, విశ్వాస్ కంప రమేష్, తిరుపతి ,బిరయ్య,సత్యనారాయణ పాల్గొన్నారు