చిన్న ప్రాణం.. పెద్ద క‌ష్టం..

-నాలుగు నెల‌ల బాబుకి అత్య‌వ‌స‌రంగా కాలేయ మార్పిడి
-రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యే అవ‌కాశం
-సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం

మంచిర్యాల : చిన్న ప్రాణానికి పెద్ద కష్టం వచ్చింది… త‌ల్లి ఒడిలో సేదాతీరాల్సిన స‌మ‌యంలో, అమ్మ తప్ప మరో ప్రపంచం ఎరుగని ఆ చిన్నారి ప్రాణం కాపాడుకునేందుకు ఆ కుటుంబం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. త‌మ‌ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టమని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

మ‌డావి అతీష్ మంచిర్యాల క‌లెక్ట‌రేట్‌లో సీసీగా విధులు నిర్వ‌హిస్తున్నారు. అతీష్‌ దంప‌తుల‌కు నాలుగు నెల‌ల కింద‌ట బాబు జ‌న్మించాడు. కొద్ది రోజులుగా అత‌ని ఆరోగ్యం బాలేక పోవ‌డంతో వైద్యుల ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లారు. ఆ చిన్నారి అయాన్ష్ కు వ‌చ్చింది చిన్న జ‌బ్బు కాద‌ని తెలియ‌డంతో వారు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. అరుదైన కామెర్ల వ్యాధి రావ‌డంతో ఖ‌చ్చితంగా లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయాల‌ని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్దం కాక ఆ కుటుంబ క‌న్నీటి ప‌ర్యంతం అవుతోంది.

శస్త్రచికిత్సకు రూ. 20 లక్షలు కావాలి..
ప్రస్తుతం అయాన్ష్ కు ఆరోగ్య ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైద‌రాబాద్‌ య‌శోద ఆసుప‌త్రిలో ఈ లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయించాల్సి ఉంది. పేద కుటుంబానికి చెందిన తమకు ఇంత పెద్ద మొత్తం సమకూర్చడం సాధ్యం కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దాతలు స్పందించి తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కోరుకుంటున్నారు. సహాయం చేయూల్సిన దాతలు 9000072687 ఫోన్ పే & గూగుల్ పే చేయాల‌ని కోరుతున్నారు.

ఎన్ఆర్ఐ రూ. 20 వేలు సాయం..
బెల్లంప‌ల్లికి చెందిన ఎన్ఆర్ఐ తోడె కృష్ణారెడ్డి ఆ చిన్నారి విష‌యం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. ఆయ‌న త‌న వంతుగా రూ. 20 వేలు అందించారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అంద‌రూ ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like