డిసెంబర్‌ నాటికి అంబేద్కర్ విగ్రహం: మంత్రి కేటీఆర్

ఈ ఏడాది డిసెంబర్ నాటికి ట్యాంక్ బండ్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంబేద్కర్ విగ్రహ నమూనాలను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు. హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసే 125 అడుగుల కాంస్య విగ్రహ నమూనాను మంత్రి కేటీఆర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంబేద్క‌ర్ విగ్రహం ఏర్పాటుకు పనులు పూర్తయ్యాయన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని తమ ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చూపుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో అంబేద్కర్ విగ్రహం తయారు అవుతోంద‌న్నారు. ప్రపంచంంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా చరిత్ర సృష్టించనుందని వెల్ల‌డించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే వారికి అంబేద్కర్ ఆదర్శమన్నారు. అంబేదర్క్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణను సాధించుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు రూ.1400 కోట్లు ఖర్చు చేయనుంది. విగ్రహం ఏర్పాటుకు సంబందించి ప్రభుత్వం జీవో నెంబర్ 2 విడుదల చేసింది. అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేదర్కర్ పార్క్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహం 125 అడుగుల ఎత్తు, వెడల్పు 45.5 ఫీట్లు ఉంటుంది.ఈ విగ్రహం ఏర్పాటుకు 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్ను ఇత్తడిని ఉపయోగించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like