వృత్తి ఎలక్ట్రీషియన్… చేసేది దొంగతనం..
-మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
-నాలుగు లక్షల విలువైన తొమ్మిది బైక్ లు స్వాధీనం

మంచిర్యాల : ఆయన చేసేది ఎలక్ట్రీషియన్… తనకు వచ్చిన పనితో వాహనాల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నాడు.. జల్సాలకు అలవాటు పడి దాన్నే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నాలుగు లక్షల విలువైన తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.. వివరాల్లోకి వెళితే..
కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన కోట రవి ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. తనకు వచ్చే డబ్బులు జల్సాలకు ఖర్చు చేసేవాడు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఐదు నెలలుగా మంచిర్యాల, హాజీపూర్, కాసీపేట, మందమర్రి ఏరియాల్లో బైక్‌లను దొంగిలించుకుని వాటిని కుదవ పెట్టి డబ్బులతో జల్సాలు చేసేవాడు. మోటారు సైకిళ్లకు ఉన్నవైర్లను కలిసి వాటిని తీసుకువెళ్లేవాడు. ఇలా మంచిర్యాలలోని హమలివాడ లో దొంగతనం చేసిన మోటార్ సైకిల్ పైనే తిరుగుతూ పార్క్ చేసిన మోటార్ సైకల్ కోసం తిరుగుతు వాహన తనికిలో IB మంచెర్యాల వద్ద పోలీసులకి పట్టుబడ్డాడు.ఇప్పటి వరకు తొమ్మిది వాహనాలను దొంగిలించినట్లు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు.
ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఇన్‌చార్జీ డీసీపీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా మంచిర్యాలలోని ఐబీ ఏరియాలో కోట రవి పట్టుబడ్డాడని తెలిపారు. హాండిల్ లాక్ వేయకుండా వున్న మోటార్ సైకిళ్లను వైర్లను కలిపి ఎత్తుకెళ్లి అమ్ముకునేవాడని తెలిపారు. ప్రజలు రోడ్డు పైన, ఇంటిముందు వాహనాలు పార్క్ చేసేటప్పుడు హ్యాండిల్ లాక్ తప్పకుండా వేయాలన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుణ్ణి పట్టుకొని అతని వద్ద చోరీ సొత్తును రికవరీ చేసిన సీఐ బీ.నారాయణ, సీసీఎస్ సీఐ డీ.మోహన్, ఎస్ఐ గంగారామ్, సీసీఎస్ ఎస్.ఐ డీ.మహేందర్, హెడ్కానిస్టేబుల్ బి,దివాకర్, కానిస్టేబుళ్లు సతీష్,కే.శ్రీనివాస్,టీ.సునీల్, వీ.శ్రీనివాస్ లను అభినిందిచి,రివార్డు అందించారు.