పుష్కరాల్లో అపశృతి… ఒకరి మృతి
మంచిర్యాల : ప‌్రాణహిత పుష్కరాలకు స్నానం చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట పుష్కర ఘాట్ లో స్నానం చేసేందుకు వైజాగ్‌కు చెందిన బొడ్ల సోమేష్ అనే వ్యక్తి కుటుంబంతో సహా వచ్చారు. సోమేశ్ (39)అనే వ్యక్తి స్నానం కోసం గోదావరిలోకి వెళ్లి అక్కడే మరణించాడు. అయితే నీటిలో పడి మృతి చెందాడా..? అక్కడికక్కడే గుండెపోటుతో మరణించాడా..? అనే విషయం తేలాల్సి ఉంది. మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి మరీ ఇక్కడ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.