ప్రభుత్వ విప్‌కు కృతజ్ఞతలు చెప్పిన విద్యార్థులు

మంచిర్యాల :తమ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేందుకు ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు చేస్తున్న కృషికి కోటపల్లి గురుకుల విద్యార్థులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలిపారు. బాల్క సుమన్ వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఆ నియోజకవర్గం రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. తాజాగా, ఆయన చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. దాని కోసం రూ. 1,658 కోట్ల నిధులు మంజూరు చేయించారు. థాంక్యూ సుమన్ అన్న అనే ఆకారంలో విద్యార్థులు కూర్చుని ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కృతజ్ఞత తెలిపారు.