విద్యుత్ షాక్ తో రైతు మృతి
మంచిర్యాల : ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్‌తో ఓ రైతు మరణించాడు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శంకరి రామన్న (60) నీరు పెట్టేందుకు పొలానికి వెళ్ళాడు. అయితే మోటార్ కు విద్యుత్ సరఫరా సక్రమంగా కాకపోవడంతో అది పనిచేయలేదు. హెల్పర్ కు ఫోన్ చేస్తే ఆలస్యం అవుతుందని తానే సరిచేయాలని దానిని రిపేర్ చేసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవ శాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మృతి పట్ల గ్రామంలో విషాదం నెలకొంది. రామన్న గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా కూడా పనిచేశారు.