బెల్లంపల్లిలో ఉద్రిక్తత
మంచిర్యాల :సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత లకు దారి తీసింది. టీఆర్ఎస్,బీజేపీ మధ్య బాహాబాహీకి దారితీసింది.
హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రకు పోలీసులు డీజే పర్మిషన్ ఇవ్వలేదు. దీనికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కారణమని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టీఆర్ఎస్ డాగ్స్ అని ఆ పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ చూసిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు క్రిష్ణ మందిర్ రోడ్డులో ఉన్న పోస్ట్ పెట్టిన వ్యక్తి దుకాణం ముందు గొడవకు దిగారు. దీంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.
ఈ విషయం తెలిసిన బీజేపీ నాయకులు పాతబస్టాండ్ ప్రధాన కూడళ్లలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదే క్రమంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమాచారం తెలుసుకొని టీఆర్ఎస్ శ్రేణులు పాత బస్టాండ్ చేరుకున్నారు. అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు పరస్పర వ్యతిరేక నినాదాలతో ప్రాంతం ఆ వేడెక్కింది. కోపోద్రిక్తులైన ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.ఒక దశలో బాహాబాహీ యుద్ధానికి దిగారు.
పోలీసులు జోక్యం చేసుకొని బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ సద్దుమణిగింది. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.