గేట్ మీటింగ్ అడ్డుకున్న టీబీజీకేఎస్ నేత‌లు

మందమర్రి ఏరియా k.k.5 గనిపై బీఎంఎస్‌ నేత‌ల గేట్ మీటింగ్ టీబీజీకేఎస్ నేత‌లు అడ్డుకున్నారు. దీంతో బీఎంఎస్, టీబీజీకెఎస్ నాయకులకు మద్య గొడవ జరిగింది. సింగ‌రేణి వ్యాప్తంగా జ‌రుగుతున్న యాత్ర‌లో భాగంగా బీఎంఎస్ నేత‌లు మంద‌మ‌ర్రి ఏరియా కేకే5 గ‌నిపై గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు వివేక్ వెంక‌ట‌స్వామి హాజ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతున్న చివ‌రి స‌మ‌యంలో తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం నేత‌లు అడ్డుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం ఏమిటని ప్ర‌శ్నించారు. బీఎంఎస్ నాయకులు అబద్దాలు చెప్పుతున్నారని అన్నారు. వాళ్లు మాట్లాడ‌కుండా అడ్డుత‌గిలారు. దీంతో బీఎంఎస్ నేత‌లు సైతం కొద్దిసేపు వారితో వాగ్వావాదానికి దిగారు. కొద్దిసేపు అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. టీబిజీకేఎస్ నాయకుల తీరు పై ప‌లువురు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ప్రతి యూనియన్ కు గని పై గేట్ మీటింగ్ లో మాట్లాడే హక్కు వుంటుందని సింగరేణి చరిత్రలో ఒక‌ యూనియన్ మీటింగ్ మరో యూనియన్ అడ్డుకోలేదని వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత బీఎంఎస్ నేత‌లు మాట్లాడి వెళ్లిపోయారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like