కలెక్టర్ పేరుతో సైబర్ మోసం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో (డీపీ) పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె డీపీ పెట్టి డబ్బులు అడుగుతున్న మోసగాళ్ళ వైనం వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటో తో (డీపీ) పెట్టి మోసానికి దిగారు కొందరు నేరగాళ్లు. 7234822110 అనే నెంబర్కి డిపి కలెక్టర్ ఫొటో పెట్టి అధికారులకు వైద్యులకు డబ్బులు కావాలంటూ వాట్సాప్ మెసేజ్ లు పంపించారు. తనకు అర్జంట్ గా డబ్బులు అవసరం ఉందని వెంటనే డబ్బులు పంపాలని మెసేజ్ లు పంపించారు. దీంతో ఒక వైద్యుడు ఆ నెంబర్ కి రూ.30 వేలు పంపించారు.
దీనిపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. అటువంటి చాటింగ్లకు, కాల్లకు ప్రతిస్పందించవద్దని కలెక్టర్ పేషి నుంచి అధికారులకు విజ్ఞప్తి మెసేజ్ పంపించారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ కోర్ విభాగం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.