ఫ్లాష్.. ఫ్లాష్.. భవనం పైకి ఎక్కి సింగరేణి కార్మికుడి ఆందోళన
ఓపెన్ కాస్ట్ మేనేజర్ తనను వేదింపులకు గురిచేస్తున్నాడని ఓ కార్మికుడు ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళితే అజ్మీర్ శివకుమార్ ఆర్జీ3 ఏరియా ఓసి1 లో డంపర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా తనను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్లు షిఫ్టుల్లో వేస్తున్నరని, మెనేజర్ ఇబ్బందులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం క్యాటీన్ భవనం పైకెక్కి నిరసన వ్యక్తం చేసాడు. తనకు న్యాయం చేయాలని ఆవేదనతో వేడుకుంటున్నాడు.