యువ‌తిపై ప్రేమోన్మాది దాడి

తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది కళ్ళు గీసే కత్తితో యువతిపై దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది..

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రేమోన్మాది యువతి పై కల్లు గీసే కత్తి తో దాడి చేశాడు.. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బొక్కల గుట్ట గ్రామానికి చెందిన మానస అనే యువతి నస్పూర్ లో బంధువుల గృహప్రవేశానికి తన తల్లితండ్రులతో కలిసి హాజరైంది. నస్పూర్ గ్రామానికి చెందిన సమీప బంధువైన సాయికిరణ్ గౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఆమెను పెళ్లి చేసుకుంటానని వారి తల్లితండ్రులను అడిగాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో యువతి,, ఆమె తల్లితండ్రులు పెళ్లికి నిరాకరించారు.

అది మనసులో పెట్టుకున్న సాయికిరణ్ బంధువుల నూత‌న గృహ ప్ర‌వేశం కార్యక్రమం ముగిసిన అనంతరం మాన‌స‌ 3.30 గంటల సమయంలో ఆటో ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చి గడ్డం సాయికిరణ్ కల్లుగీత కత్తితో ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన యువతి తండ్రి, బంధువులు అతన్ని దూరంగా నెట్టివేశారు. ఈ క్రమంలో అతని చేతిలోని కత్తితో ఆమె మెడపై గాయం అయింది. వెంటనే బంధువులు ఆమెను ఆటోలో మంచిర్యాల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగానే ఉంది. యువతి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like