జిల్లా కేంద్రంలో తుపాకీ కలకలం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ చెరువు ఒడ్డున ఉన్న బండపై తుపాకీ లభించింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిర్మల్ ఏఎన్ రెడ్డి కాలనీలోని దివ్య గార్డెన్ పక్కన సఖి సెంటర్ వద్ద చెరువులోని బండపై తుపాకీని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పిస్తోల్, పడిరౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తుపాకీ ఇక్కడికి ఎవరు తెచ్చారు..? ఎలా వచ్చింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది సర్వీస్ రివాల్వర్ గా పోలీసులు భావిస్తున్నారు. ఇది ఒక ఐడి పార్టీకానిస్టేబుల్ ది గా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.