గర్భిణులకు ఇంటికే పోషకాహారం

తెలంగాణ సర్కార్ గర్భిణులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల లబ్దిదారులకు వేసవి సెలవుల్లో ఇబ్బందులు రాకుండా ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించుకుంది.
మే 1 నుంచి 15 వరకు అంగన్వాడీ టీచర్లకు, మే 16వ తేది నుంచి 30 వరకూ అంగన్వాడీ సహాయకులకు సెలవులు ఉండటంతో సర్కార్ అలర్ట్ అయ్యింది. అంగన్వాడీ చిన్నారులు,గర్భిణులు,బాలింతల ఇళ్లకే రేషన్ సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారులకు గుడ్లు, బాలామృతం, పోషకాహారాన్ని వేసవిలో సక్రమంగా అందజేయాలని సూచించింది.