సోయాబీన్ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వండి
సిఎం కేసీఆర్ కు ఎంపీ సోయం బాపు రావు లేఖ
ఆదిలాబాద్ : సోయాబీన్ విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎంపీ సోయంబాపురావ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పెద్దఎత్తున సోయాబీన్ సాగు చేస్తారని చెప్పారు. దాదాపు 90 వేల మంది రైతులు సోయాసాగుపై ఆధారపడ్డారని తెలిపారు. మూడేండ్ల నుంచి సోయాబీన్ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. విత్తనాల ధర బాగా పెరిగిందన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.