మీ ఎంపీల‌పై దాడులు చేస్తాం..

-బాల్క సుమన్ ఎమ్మెల్యేనా....? గుండానా....?
-రానున్న ఎన్నికల్లో ఓటమి భయం తోనే దాడులు
-దాడులు చేసిన వారిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయాలి
-ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మంచిర్యాల :మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మీద టీఆర్ఎస్ నేత‌ల దాడి మంచి ప‌ద్ద‌తి కాద‌ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో బిజెపి నాయకుల పై టిఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన బీజేపీ నాయకులను ఆసుపత్రిలో పరామర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు.. మీకు ఇక్క‌డ అధికారం ఉంద‌ని మీరు మా వాళ్ల మీద దాడులు చేస్తున్నారు.. త్వ‌ర‌లో పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉన్నాయి.. మేం అక్క‌డ అధికారంలో ఉన్నాం… మాకు అక్క‌డ బ‌లం ఉంది. మేం మీం ఎంపీల‌పై దాడులు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అలాంటి ప‌రిస్థితి తీసుకురావ‌ద్ద‌ని కోరారు. తాము ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్నమ‌ని ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి ప్ర‌శ్నిస్తామ‌ని అన్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను చంపండి.. కొట్టండి అన‌డం ఎలాంటి ప్ర‌జాస్వామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాల్క సుమన్ ఎమ్మెల్యేనా….? గుండానా….? అంటూ సోయంబాపురావ్ ప్ర‌శ్నించారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తనకు తాను తోపు గా భావించుకుంటు బిజెపి నేతల పై దాడులకు పూసిగొల్పుతున్నాడని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే టిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు, కార్యకర్తల పై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్య నికి ప్రమాదకరమని హెచ్చరించారు.. ఇప్పటికైనా మీరు మారి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని హిత‌వు ప‌లికారు. ఉంటే త‌మ పార్టీలో ఉండాల‌ని బీజేపీలో ఉంటే దాడులు చేస్తామ‌ని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌డం ఏ మేర‌కు స‌మంజ‌సమ‌న్నారు.

దాడులు చేసిన వారిపై హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేయాల‌ని ఎంపీ సోయం బాపురావ్ డిమాండ్ చేశారు. దాడి చేసి రైతులు కొట్టార‌ని చిత్రీక‌రించ‌డం సిగ్గుచేట‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇది మీ జాగీరు కాద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న వెంట బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ర‌ఘునంద‌న్‌రావు, జిల్లా ఇన్‌చార్జీ ప‌ల్లె గంగారెడ్డి, యువ‌మోర్చా రాష్ట్ర అధికార ప్ర‌తినిధి తులా అంజ‌నేయులు, రాష్ట్ర నాయ‌కులు ముల్క‌ల మ‌ల్లారెడ్డి, తుల మ‌ధుసూద‌న్‌రావు, మున్నారాజా సిసోడియా, అశోక్‌వ‌ర్ద‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like