ఎన్నో హక్కులు సాధించాం..
-జాతీయ కార్మిక సంఘాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి
-TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ కెoగర్ల మల్లయ్య
-ఏఐటీయూసీ నుంచి పెద్ద ఎత్తున టీబీజీకేఎస్‌లో చేరిక
మంచిర్యాల : తమ హయాంలోనే ఎన్నో హక్కులు సాధించామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెoగర్ల మల్లయ్య స్పష్టం చేశారు. ఆయన ఆర్‌కే-7ఏ గనిపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత కార్మికులకు ఎన్నో హక్కులు సాధించామన్నారు. కోల్ ఇండియాలో లేని విధంగా ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని స్పష్టం చేశారు. కొన్ని జాతీయ సంఘాలు పనిగట్టుకొని కావాలని కార్మికులకు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వాటిని కార్మికలోకం తిప్పి కొడుతుందన్నారు. జాతీయ సంఘాలు కార్మికులు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ జోక్యంతోనే హక్కుల సాధన సాధ్యమైందన్నారు. ఈ రాజకీయ జోక్యంతోనే జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్యనియామకాల రూపంలో యువత ఉద్యోగ, ఉపాధి కలుగుతోందని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు 87 మెడికల్ బోర్డులు నిర్వహించి 10,000 మంది కార్మికుల బిడ్డలకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చాయంటే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకున్న రాజకీయ జోక్యం వల్లే అని స్పష్టం చేశారు. మ్యాచింగ్ గ్రాంట్ పెంపు, సకలజనుల సమ్మె కాలానికి వేతనం ప్రపంచంలో ఎక్కడా ఇలా ఇవ్వలేదని, కేవలం సింగరేణిలోనే సాధ్యమైందన్నారు. లాభాల వాటా పెంపు, సర్ఫేస్ వెళ్లే కార్మికులకు బేసిక్ ప్రొటెక్షన్, కార్మికులకు ఏ.సి.సౌకర్యం, కరెంట్బిల్లు రద్దు తదితరాలన్నీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ లో ఉధ్యోగం వద్దనుకుంటే 25 లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే కార్మికులకు ఎన్నో హక్కులు సాధించిపెట్టిన ఘనత టీబీజీకేఎస్‌దే అన్నారు.
కొన్ని జాతీయ సంఘాలు తమ ఉనికి కాపాడుకోవడానికి టీబీజీకేఎస్‌పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ బురద చల్లాలనే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. చైతన్యవంతమైన కార్మికులు ఇవన్నీ గమనిస్తున్నారని వెల్లడించారు. జాతీయ సంఘాలు చెప్పే మాటలను ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికుల కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న TBGKS వైపే ఉండాలని కోరారు. ఈ సందర్భంగా AITUC నుండి రాజారామ్, శంకర్,కొమురయ్య,పులి భీముడు,నర్సయ్య మైనింగ్ స్టాప్ నుండి సాంబశివుడు,మహేష్ రెడ్డి లతో పాటు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన జనరల్ మజ్దూర్లు, యువ బదిలీ వర్కర్ లు TBGKS యూనియన్లో చేరారు. వారికి కెంగర్లమల్లయ్య కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు.
శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కెతిరెడ్డి సురేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర ఉపాధ్యక్షులు డీకొండ అన్నయ్య, మంద మల్లారెడ్డి,కేంద్ర చర్చల ప్రతినిధి రవీందర్ రెడ్డి,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అశోక్,ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి,పెట్టం లక్ష్మణ్,బుస రమేష్,ఏరియాసెక్రెటరీ పానుగంటి సత్తయ్య,జగదీశ్వర్ రెడ్డి,ఏరియా నాయకులు లాగాలశ్రీనివాస్,ఐరెడ్డి తిరుపతి రెడ్డి,కిషన్,మైన్ ఫిట్ సెక్రటరీ శ్రీ రాములు,లాలా జంపయ్య,హనుమంతు,యువ నాయకులు ఉప్పాల సంపత్, జైపాల్ రెడ్డి,కరుణాకర్,జక్కుల సాగరు,సర్పరాజు,ఆకుల సతీష్, మల్లేష్,కరుణాకర్,వీరస్వామి పాల్గొన్నారు.