ఫ్లాష్.. ఫ్లాష్.. పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్..
-ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
-కంటైనర్ గన్ పౌడర్, పేలుడు పదార్థాలు స్వాధీనం
-ఆయుధాలు ఆదిలాబాద్‌కు చేరేలా ప్రణాళిక...?
ఆదిలాబాద్ : ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్రవాద దాడిని భగ్నం చేశారు. ఈ మేరకు సోదాల్లో భాగంగా హర్యానా కర్నాల్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి కంటైనర్ గన్ పౌడర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇవి పాకిస్తాన్ నుంచి అందుతున్నట్లు వారు అనుమానాలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్ నుంచి వారికి ఆదేశాలు అందుతున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. డ్రోన్ల ద్వారా వీటిని జారవిడినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ఈ పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఆయుధాలు చేరవేయాల్సిందిగా నిందితులకు ఆదేశాలు అందినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా నిందితులు గురుప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపిందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.