ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం పోరాటం

బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్‌రావు

మంచిర్యాల : ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్‌రావు ఆవేదన వ్య‌క్తం చేశారు. ఆదివారం దండేపల్లి మండలంలో మ్యాదరిపేట్, పర్ధాన్ గూడెంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగు నీరు సమస్య, డ్రైనేజి సమస్యలు ఉన్నాయ‌ని అన్నారు. పాల‌కులు క‌నీస మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి సారించ‌డ‌క‌పోడం దారుణ‌మ‌న్నారు.

భర్త చనిపోయిన మహిళలకు వితంతు పింఛనులు ఇవ్వడం లేదని, చదువుకున్న యువత‌ ఉద్యోగాలు లేక కూలీ పనికి వెళ్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక్కడ నివసించే వారికి ఇండ్లు కూడా లేక గుడిసెల్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధులను పేదలకు ఖర్చు పెట్టకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. మండలంలో ఉన్న సమస్యల మీద దృష్ఠి పెట్టాలని MPDO, MRO, కలెక్టర్ ని కోరారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేపీ తరఫున కొ్ట్లాడుతామ‌న్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాజనీష్ జైన్, రవి గౌడ్, సురేందర్, కిషన్, శ్రీనివాస్, వంశీ, విజేందర్, వెంకటేష్, భీమయ్య బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like