బీజేవైఎం ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం
BJYM జిల్లా అధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ
మంచిర్యాల : టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని BJYM జిల్లా అధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్1 పరీక్ష ఉర్దూలో రాయడానికి తెలంగాణ ప్రభుత్వ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ప్రతీ వర్గానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువకుల ఆత్మహత్యలకు కారణం ముఖ్యమంత్రి KCR అని ఆరోపించారు, కొన్ని సంత్సరాలుగా కేసులకు భయపడకుండా BJYM ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళనలకు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడటం వలన మొన్నటికి మొన్న నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. కానీ MIM పార్టీకి TRS పార్టీ తొత్తుగా మారి ఒక వర్గానికి మాత్రమే లాభం జరిగే విధంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమెరిశెట్టి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు బోయిని దేవేందర్, రెడ్డిమల్ల అశోక్, సెక్రటరీ మద్ది సుమన్, కుర్రే చక్రవర్తి, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు రాచకొండసత్యనారాయణ,చెగొండశ్రీనివాస్,సంతురామ్,సంపత్ కుమార్,రాకేష్ రెనవా,ఎడ్ల చంద్ర శేఖర్, పీవీఆర్ రాజేష్,ప్రవీణ్ నాయక్ పాల్గొన్నారు.