పైపుల పక్కదారి.. ఇద్దరి సస్పెన్షన్..
మంచిర్యాల :సింగరేణిలో పైపులు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఇద్దరిపై వేటు వేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని నుంచి టూ టౌన్ పోలీస్‌స్టేషన్ కు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పైపులు పంపించారు. అయితే అవి కాస్తా స్టేషన్ రోడ్ కాలనీకి వెళ్లాయి. ఈ వివాదంలో ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణ జరిపించిన అనంతరం అందుకు బాధ్యులుగా గుర్తించిన రాజ్‌కుమార్, దాసరి శ్రీనివాస్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ఏజెంట్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వెళ్లాల్సిన పైపుల కంటే అదనంగా వాటిని తీసుకువెళ్లడం, పక్కదారి పట్టించడం వంటి చర్యలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.