చదువుల తల్లి దర్శనానికి వచ్చి… మృత్యు ఒడికి…
నిర్మల్ : చదువుల తల్లి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు విద్యార్థులు గోదావరి నది నీట మునిగి మృతి చెందారు. ప్రమాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17 మంది విద్యార్థుల బృందం అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రం బాసరవచ్చారు. శనివారం ఉదయం గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. ఇందులో కిరణ్ (22) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా. మరో విద్యార్థి ప్రతీక్ (22) కిరణ్‌ను రక్షించే ప్రయత్నం చేశాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో గోదారిలో మునిగి మృతి చెందారు. నీట మునుగుతున్న ఇద్దరు విద్యార్థులను రక్షించేందుకు విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న భక్తులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బాసర పోలీసులు నీట మునిగిన విద్యార్థుల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.