సాటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన కార్మికులు
మానవత్వం చాటిన kk1 గని ఉద్యోగులు
మంచిర్యాల : ఎదుటిమనిషి కన్నీరు తుడవడానికి రక్త బంధమో, స్నేహబంధమో పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదు పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు అని నిరూపించారు సింగరేణి కార్మికులు. తోటి కార్మికుడు మరణించడంతో వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు మందమర్రి KK1 ఉద్యోగులు, కార్మికులు…వివరాల్లోకి వెళితే.. kk1 లో బదిలీ ఫిల్లర్ గా పని చేసే ఆత్రం సోనేరావు ఈనెల 1న చనిపోయాడు. కుటుంబం చాలా పేదరికంది కావడంతో వారికి ఆ గని కార్మికులు అండగా నిలబడ్డారు. దహన సంస్కారాలు సైతం చందాలతో నిర్వహించారు. దాదాపు రెండు వారాలుగా కార్మికులు అందరూ ఏకమై రూ. 1,06,000 జమ చేశారు. గతంలో సైతం వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. శనివారం ఆ కుటుంబాన్ని పిలిచి ఆ డబ్బులు అందించారు. ఆత్రం సోనేరావు తల్లి కమలభాయ్ కి ఆ గని పిట్ సెక్రటరీ బిల్లా మాధవరెడ్డి కేక్1 గని మేనేజర్ G.లక్ష్మీనారాయణ చేతుల మీదగా 10 వేల రూపాయలు అదనంగా అందించారు.