ప్రజల కోసం చేస్తాం… పబ్లిసిటీ కోసం కాదు..
ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : తాము ప్రజల కోసం పని చేస్తామని పబ్లిసిటీ కోసం కాదని ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. శనివారం మంచిర్యాలలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాలను ప్రారంభించారు. శనివారం ట్రస్ట్ సెక్రెటరీ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి అంబలి పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రస్టు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరంతరం ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. పబ్లిసిటీ కోసం మాత్రం పరితపించమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ వడ్డే రాజమౌళి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కౌన్సిలర్ రామగిరి బాణేష్, మహిలా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, కౌన్సిలర్ సల్ల మహేష్, కొండ పద్మ,పుదారి సునీత, జోగుల శ్రీలత, పట్టణ ఉపాధ్యక్షులు సదానందం,RGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా జనరల్ సెక్రటరీ బాబన్న, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్, మాహిళ పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత, ఉపాధ్యక్షురాలు శైలజ, ప్రధాన కార్యదర్శి కవాడి పల్లవి,గాండ్ల సత్తమ్మ, అర్కల హేమలత, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య, స్రవంతి, సరస్వతి,మహిళ పట్టణ ప్రధాన కార్యదర్శి పద్మ,నేహా,ఎంపీటీసీ డేగ బాపు, పెంట రమేష్,తూముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.