కార్మికులకు నష్టం చేసేది జాతీయ కార్మిక సంఘాలే
-ఏ మొహం పెట్టుకొని గనులపైకి వస్తారు -టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య
జాతీయ సంఘాలు తమ మనుగడ కాపాడుకోవడానికి పనిగట్టుకొని తెలంగాణ బొగ్గుగని సంఘాన్ని విమర్శిస్తున్నారని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. ఆర్జిటు ఏరియా వర్కషాప్ గేట్మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సికాస స్ఫూర్తితో అప్పుడు ఉన్న 72 సంఘాలు ఐక్యంగా సాధించిన హక్కులను జాతీయ సంఘాలు పోగొట్టాయని అన్నారు.
VRS గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో వేలాది మంది కార్మికులను సంస్థ నుండి వెల్లగొట్టారని దుయ్యబట్టారు. సింగరేణి సంస్థ లో కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చిన సంఘాలు కాదా..? అని ప్రశ్నించారు. కోల్ ఇండియా కంటే అదనంగా 18 రకాల హక్కులు సాధించిన సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అని అన్నారు. అటువంటి సంఘాన్ని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. పదవ వేజ్ బోర్డు లో కార్మికులకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. గనుల పైకి అసత్య ప్రచారాల తో వస్తున్న జాతీయ సంఘాలను ప్రతి కార్మికుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆర్జి టు ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ రెడ్డి,దేవావెంకటేశం, ప్రభాకర్ రెడ్డి,ఐ.సత్యం,ఏట్టం కృష్ణ, దశరథం దాసం సురేందర్, మల్లేశ్వరరావు, రవీందర్, నరసింహారెడ్డి రామశర్మ విజయసారథి,అశోక్, శంకర్ సురేష్, శ్రీనివాస్, బాపు పాల్గొన్నారు.