ఛలో హైదరాబాద్ వెళ్తున్న వీఆర్ఏల అరెస్ట్
బెల్లంపల్లి : వీఆర్ఏలకు పేస్కేల్ అమలుచేయాలని ఛలో హైదరాబాద్ కు వెళ్తున్న వీఆర్ఏలను బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ తమ హక్కుల అమలు చేయాలని డిమాండ్ చేస్తే అరెస్టు చేయడం అప్రజ్వామికం అన్నారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సంవత్సరాలు వయసు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు జంబీ శ్రీనివాస్, నాయకులు జాంబి మహేందర్ రామారావు మాధురి మురళి సందేశ్ తదితరులు పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ మహేందర్, సీనియర్ నాయకులు తొంగల మల్లేష్ మద్దతు తెలిపారు.