ఆంధ్రోళ్ల దందా… అధికార పార్టీ అండ
ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఆగ్రహం
ఆంధ్రాకి చెందిన ఓ ముఠా మందమర్రి కేంద్రంగా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లో నకిలీ దందా సాగిస్తోంది. కౌలు రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చిన కొందరు వ్యవసాయాన్ని వదిలి నకిలీ సీడ్ బిజినెస్లో ఆరితేరారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నరు.
కొన్ని రోజులుగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నరు. అడపాదడపా కేసులు పెట్టినా.. అధికార పార్టీ లీడర్ల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. రైతులను నిండా ముంచుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ రైతన్నలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం” అని విజయశాంతి ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.