ఆ ఇద్దరి కంట కన్నీరు..
మంచిర్యాల : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి కంటతడి పెట్టుకున్నారు. వీరిద్దరు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీ వీడినందుకు బాధగా ఉందని అయినా తప్పలేదని ఓదెలు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి సైతం ఉద్వేగానికి గురయ్యారు. ఆమె సైతం కన్నీరు పెట్టుకున్నారు. నల్లాల ఓదెలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వీడాలంటనే బాధగా ఉందని, కానీ తప్పడం లేదన్నారు.