బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య
సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె తెలంగాణకు చెందిన వారు కాగా, ఆంధ్రాప్రాంతంలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో పలు బ్రాంచీల్లో పనిచేసిన దివ్యవాణి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణానికి కారణం ఆర్థిక ఇబ్బందులుగా తెలుస్తోంది.