ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు
-అంత దూరంలో కట్టడమే అతి పెద్ద తప్పిదం -జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ -గర్భిణులు, బాలింతల కోసం ఉచిత ఆటో సౌకర్యం

మంచిర్యాల : మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణా కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆసుపత్రిలోని వార్థులను తిరుగుతూ రోగులను పరామర్శించారు. సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. గోదావరి తీరాన ఆసుపత్రి నిర్మించడమే అతిపెద్ద తప్పిదమని సురేఖ అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలు ఉన్నారని వారికి ఫ్యాన్ సౌకర్యం కూడా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన ఈ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే వారి కోసం తాము చల్లని మినరల్ వాటర్ అందజేస్తున్నట్లు వెల్లడించారు.
అందుబాటులోకి ఆటో సౌకర్యం..
మాతాశిశు ఆస్పత్రికి వెళ్లే రోగుల సౌకర్యార్థం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో ఉచిత ఆటో రవాణా సౌకర్యాన్ని కల్పించారు. అక్కడికి వెళ్లడానికి మహిళలు ఇబ్బంది పడుతుండంతో ఉచితంగా ఆటో ద్వారా రవాణా సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు తూముల నరేష్,మంచిర్యాల మున్సిపల్ డిప్యూటి ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత,యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్,నాయకులు కొండ శేఖర్,బొల్లం భీమయ్య,పుదరి ప్రభాకర్,ఆత్రం శంకర్,సాయి,సురేందర్,తాజ్, రాజ్ కుమార్,రాము,సత్యం,హనుమండ్లసతీష్,వేములరమేష్,తోట సంతోష్,భీమయ్య,అర్కల హేమలత తదితరులు పాల్గొన్నారు.