భైంసా తహసీల్దార్ నరేందర్ అరెస్టు
నిర్మల్ : నిర్మల్ జిల్లా భైంసా మండలం తహశీల్దార్ అర్రా నరేందర్ అరెస్టయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇండ్లలో సోదాలు నిర్వహించగా రూ.1,16,28,314 విలువైన చర స్థిరాస్తులు, రూ.1,32,096 నగదు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల లెక్కింపు జరుగుతోందని స్పష్టం చేశారు. గత ఏడాది ఓక వీఆర్ఏపై అవినీతి కేసు నమోదు చేసిన అధికారులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులోనరేందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆయను అరెస్టు చేసి కరీంనగర్లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల స్పెషల్ జడ్జీ ముందు హాజరుపరిచారు.
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినా లేదా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి 1064 టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించాలని యాంటీ కరప్షన్ బ్యూరో, డైరెక్టర్ జనరల్ ప్రజలను అభ్యర్థించారు.