కీచక వీఆర్ఓ

సిట్టింగ్ స్క్వాడ్ గా విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చెన్నూరు సాంఘిక సంక్షేమ పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ గా విఆర్ఓ చంద్రమౌళి విధులు నిర్వహిస్తున్నాడు. ఆడపిల్లల భుజాలపై చేతులు వేస్తూ ఇబ్బదులకు గురిచేస్తున్నాడు. పరీక్ష రాస్తానని.. నీకేం ఇబ్బంది లేదని తానే అంతా చూసుకుంటానని చెప్పాడు. దీంతో భయపడిన విద్యార్థి ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పింది. మూడు రోజులు గా ఇలాగే వేధిస్తున్నాడని చెప్పడంతో విద్యార్థి తల్లి తండ్రులు, బంధువులు వీఅర్ ఓ ను నిలదీశారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.