జీరో దందాలపై ఆగని టాస్క్ ఫోర్స్ దాడులు

ఉత్పత్తి సమీక్ష అనంతరం సింగరేణి సి&ఎం.డి.  శ్రీధర్‌ ప్రకటన

లక్షేట్ పేట్ కు చెందిన కొంతమంది తుక్కు వ్యాపారులు, ధనార్జనే ధ్యేయంగా, ప్రభుత్వ పన్నులు ఎగవేస్తూ అధిక లాభాలు గడించాలనే ఉద్దేశంతో, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, రహస్యంగా, లారీలలో లక్షల విలువ చేసే తుక్కు అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు అర్ధరాత్రి సమయంలో మాటు వేసి పట్టుకోవడం జరిగింది. లక్షేట్ పేట్ పోలీస్ మరియు కమర్షియల్ టాక్స్ అధికారుల సమక్షం లో రెండు లారీలను తూకం వేయించగా ,మొదటి లారీ (MH21X 2551) 23.405 టన్నులు, రెండవ లారీ (MH26AD0885) 27.495 టన్నులు మొత్తం కలిపి 50.9 టన్నుల బరువు కలిగిన ఎలాంటి అనుమతులు లేని ఇనుము తుక్కు ఉండటంతో అందుకుగాను కమర్షియల్ టాక్స్ అధికారుల ద్వారా రెండు లారీలకు కలిపి ఏడు లక్షల 30 వేల ఐదు వందల ఇరవై (7,30,520/-) రూపాయల పన్ను మరియు జరిమానా విధించడం జరిగింది  ఎస్ కే హైదర్ s/o. మౌలానా,లక్షేట్ పేట్.
చింతల ఉపేందర్ హజిపూర్.ఎస్.కే ఇబ్రహీం s/o. మౌలానా,లక్షేట్ పేట్. ఎస్.కే ఫరూక్ s/o. మౌలానా,లక్షేట్ పేట్ డ్రైవర్లు నితిన్ శేజుల్ , జాల్నా, మహారాష్ట్ర  జస్పాల్ సింగ్ నాందేడ్ మహారాష్ట్ర రామగుండం సీపీ. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఇలాంటి అక్రమ దందాలు, చీకటి దందాలు నిర్వహించే వారి పూర్తి సమాచారం సేకరించామని వారిపై వరుస దాడులు నిర్వహించడం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ సి ఐ ఏ.కే.మహేందర్ తెలియజేశారు ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సి.ఐ. ఏ కే మహేందర్,
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ శ్రీనివాస రావు,టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్,
భాస్కర్ గౌడ్, శ్యాంసుందర్ మరియు కమర్షియల్ టాక్స్ సిబ్బంది , లక్షేట్ పేట్ పోలీసులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like