జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా యాదగిరి
మంచిర్యాల : జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా పిల్లుట్ల యాదగిరి బాధ్యతలు స్వీకరించారు. ఆయన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మంచిర్యాలకు బదిలీపై వచ్చారు. గతంలో శ్యాం రావ్ రాథోడ్ నిర్మల్, మంచిర్యాల్లో పని చేశారు. రైతులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ తరఫున అన్ని రకాలుగా అవగాన కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.