కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
-ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనాలి
-బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల : జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచామని అధికారులు చెబుతున్నారని కానీ అది వాస్తవం కాదని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెన్నల మండలం జోగాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించక పోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించపోవడంతో అకాల వర్షాలతో వడ్లు తడిసి ముద్దయి నష్టం జరుగుతోందన్నారు.ప్రభుత్వ అధికారులు జిల్లా అంతట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పినా కొన్ని చోట్ల ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి ఎలాంటి కోతలు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేసి రైతుకు రశీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు శైలందేర్ సింగ్, ఎంపిటిసి బొమ్మెన హరీష్ గౌడ్, కోడి రమేష్ నగేష్, సంతోష్, శ్రీనివాస్, సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.