ముస్లింలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

బండి సంజయ్ మసీదులకు వ్యతిరేకంగా చేసిన వివాదస్పద వ్యాఖ్యల విషయంలో ముస్లింలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తాండూరు ముస్లిం కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బండిసంజయ్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. సంజయ్ క్షమాపణలు చెప్పేంత వరకు రోడ్లపైన ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మతాల పేరిట చిచ్చు పెట్టడం సరికాదన్నారు. తెలంగాణలో ఉన్న బిజిగిర్షరీఫ్,పెద్దగుట్ట, వేములవాడ,సైలనిబాబా, సూఫీదర్గాల్లో ముస్లింలకంటే హిందువులే ఎక్కువగా ఆరాధిస్తారన్నారు.మసీదుల జోలికి వెళ్తే మిమ్మల్ని తరిమికొట్టేది హిందువులే అని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంజయ్‌పై కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తాండూర్ దర్గా కమిటీ అధ్యక్షుడు సాబిర్ హుస్సేన్, మైనారిటీ ప్రెసిడెంట్ గౌస్, మసీదు కమిటీ పెద్దలు అక్బర్,జావీద్ హుస్సేన్,జలాల్,అజాం,జానీ,ఖలీల్ ఖాన్,జాకిర్,దర్గా కమిటీ కార్యదర్శులునియాజ్,సోహెల్,బషీర్,అమీర్,రైస్ భాయ్,కలిమ్,మున్ను,రషీద్,ఫయాజ్ పాల్గొన్నారు.