పంచాయతీ అధికారులపై చర్యలు
విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఒకరిని సస్పెండ్ చేశారు. మరో నలుగురిపై క్రమశిక్షణ చర్యలతో పాటు సంబంధిత మండల పంచాయతీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ డీపీవో శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. తలమడుగు మండలం పల్సి-బి జూనియర్ పంచాయతీ కార్య దర్శి సచిన్ సస్పెన్షన్ అయ్యారు. పంచాయతీ కార్యదర్శులు సాయి కుమార్ (బెల్సరీరాంపూర్, భీంపూర్ మండలం),శంకర్ (భీంపూర్, నార్నూర్ మండలం), కుమ్ర మానిక్ రావు(గాదిగూడ), సంతోష్ కుమార్(లక్ష్మిపూర్, తలమడుగు మండలం)లపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.తలమడుగు, గాదిగూడ, భీంపూర్ మండల పంచాయతీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.