సివిల్స్ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా
సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 685 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది మహిళలే సత్తా చాటారు. టాప్-3లో ముగ్గురు అమ్మాయిలు ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా సివిల్స్‌లో మెరిశారు. ఒకరు టాప్ 15లో చోటు దక్కించుకోగా.. మరో నలుగురు 100లోపు స్థానాల్లో ఉన్నారు.
యూపీఎస్సీ నిర్వహించిన పరీక్ష 2021 తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్ సహా పలు విభాగాలకు మొత్తం 685 మందిని ఎంపిక చేశారు. జనరల్ కేటగిరీలో244 మంది, ఈడబ్ల్యూఎస్73 మంది, ఓబీసీ203 మంది, ఎస్సీ105, ఎస్టీ60 మంది ఎంపికయ్యారు. వీరిలో ఐఏఎస్180, ఐఎఫ్ఎస్37, ఐపీఎస్200, సెంట్రెల్ సర్వీసెస్ గ్రూప్-ఏ 242, గ్రూప్ బి సర్వీసెస్ 90 మొత్తం 749 ఖాళీలున్నాయి. ఎంపికైన 685 మందితో కలిపి రిజర్వ్ జాబితాలో మరో 126 మందిని ఉంచారు.
మొదటి పది స్థానాల్లో ఎక్కువ మంది అమ్మాయిలే నిలవడం గమనార్హం. శ్రుతిశర్మకు మొదటి ర్యాంకు దక్కగా.. అంకిత అగర్వాల్ రెండో ర్యాంకు, గామిని సింగ్లా మూడో ర్యాంకు, ఐశ్వర్య వర్మ నాలుగో ర్యాంకు, ఉత్కర్ష్ ద్వివేది ఐదో ర్యాంకు, యక్ష్ చౌదురి ఆరో ర్యాంకు, సంయక్ జైన్ ఏడో ర్యాంకు, ఇషిత్ రాత్ ఎనిమిదో ర్యాంకు, ప్రీతమ్ కుమార్ తొమ్మిదో ర్యాంకు, హరకీరత్ సింగ్ రాంధ్వా పదో ర్యాంకు సాధించి సత్తాచాటారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు టాప్-100లోపు ర్యాంకులను సాధించడం విశేషం. యశ్వంత్‌కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు, పూసపాటి సాహిత్య 24వ ర్యాంకు, కొప్పిశెట్టి కిరణ్మయి 56వ ర్యాంకు, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. అలాగే, అకునూరు నరేష్ (117వ ర్యాంకు),బి.చైతన్య రెడ్డి (161వ ర్యాంకు), ఎస్.కమలేశ్వరరావు (297వ ర్యాంకు), నల్లమోతు బాలకృష్ణ (420వ ర్యాంకు), ఉప్పులూరి చైతన్య (470వ ర్యాంకు), సంతోష్‌కుమార్ రెడ్డి (488వ ర్యాంకు).