ఉత్పత్తితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత
-మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్
-సింగరేణి కార్మికుల రక్తదాన శిబిరం ప్రారంభం
మంచిర్యాల : సింగరేణి యాజమాన్యం ఉత్పత్తితో పాటు ప్రజా సంక్షేమానికి సైతం ప్రాథాన్యత ఇస్తుందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన మంగళవారం MVTCలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు, ప్రభుత్వ ఆసుపత్రిలోని పేదలు,గర్భిణీలు,కిడ్నీ,డయాలసిస్ పేషెంట్లు, అత్యవసర ఆపరేషన్లకు ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు. మందమర్రి MVTC ఆధ్వర్యంలో ఇప్పటివరకు 29 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం గోపాల్ సింగ్,పర్సనల్ మేనేజర్ వరప్రసాద్,MVTC మేనేజర్ శంకర్, ట్రైనింగ్ ఆఫీసర్ అశోక్ కుమార్, MVTC ఓవర్మెన్లు సాగర్లలక్ష్మణ్,రాజేశం,శ్రీనివాస్,రఘువరన్ TBGKS ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లిసంపత్ AITUC ఏరియా బ్రాంచి సెక్రటరీ సత్యనారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యుడు సూరం లక్ష్మణ్, మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.