తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం..
తిరుమలలో బుధవారం నుంచి ప్లాస్టిక్ నిషేధించినట్లు టీటీడీ ప్రకటించింది. అలిపిరి టోల్గేట్ దగ్గరే తనిఖీలు చేసి.. ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెట్టనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్లు తెలిపింది.జూన్ 1 నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని.. దుకాణదారులు, హోటళ్ల ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. షాంపులు కూడా తిరుమలలో నిషేధించారు. అలాగే తిరుమలలో దుకాణదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది. టీటీడీ చాలా రోజుల ముందు నుంచే తిరుమలలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు చెప్పింది.