సోనియా వల్లే తెలంగాణ

మంచిర్యాల : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్ధం చేసుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమం చేశారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోనియా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పేరంశ్రీను, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ మోమిన్ అలీ, మాజీ ఎంపిటిసి రెబ్బెన రామ్ చందర్ వార్డ్ సభ్యులు కుశ్నపల్లి లక్ష్మణ్, గొల్లపల్లి బానేష్, పోగు రవి, భీమరాజు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.