టీఆర్ఎస్ పేరు చెప్పి బెదిరిస్తున్నడు..
మంచిర్యాల : తన ఇంట్లో అద్దెకు ఉంటున్న టీఆర్ఎస్ లీడర్ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని.. అడిగితే పార్టీ పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నాడని మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేటకు చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని బ్యానర్ పట్టుకుని మరీ పట్టణంలో తిరిగాడు.. వివరాల్లోకి వెళితే…
లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ టిఆర్ఎస్ లీడర్. ఆయన ఓ ఇంట్లో రెండు సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్నారు. అయితే ఇంటి అద్దె చెల్లించకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల కరెంట్ బిల్లు 9000 వస్తే కట్టమంటే కట్టలేదని తెలిపారు. ఈ విషయమై లక్సెట్టిపేట ఏఈకి చెప్పినా పట్టించుకోలేదు. తర్వాత డీఈకి చెప్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడంతో రాతపూర్వకంగా ఏఈకి ఫిర్యాదు చేశారు. దీంతో 9000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాడు.
అదేవిధంగా ఇంటి అద్దె విషయంలో పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సురేష్ నాయక్ తో మాట్లాడి అడిగినప్పుడు ఒక నెల రోజుల్లో రూము ఖాళీ చేస్తా అని చెప్పాడు. కానీ రెండు నెలలు అవుతున్నా.. ఇంతవరకు రూము ఖాళీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సురేష్ నాయక్ గురించి మున్సిపల్ చైర్మన్ కి కూడా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మునిసిపల్ చైర్మెన్ కూడా నెలలో ఖాళీ చేయిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ ఇంకా రూమ్ ఖాళీ చేయకుండా ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అతన్ని మా ఇంట్లో నుంచి ఖాళీ చేయిస్తే మాకు న్యాయం చేసినట్లవుతుందని వేడుకుంటున్నాడు. సురేష్ నాయక్ వల్ల మానసికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు. కుటుంబ సమస్యల్లో తల దూరుస్తున్నాడని చెప్పారు.