కేంద్రం నిధులతోనే మంచిర్యాల అభివృద్ధి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి రఘునాథ్‌రావు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి రఘునాథ్‌రావు స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ జిల్లాలో మూడు జాతీయ రహదారుల నిర్మాణం కొనసాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల అనుసంధానం కోసం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం సాగుతోందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మరుగుదొడ్లు, గ్రామాల్లో రైతు వేదికలు, స్మశాన వాటికకు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణాలు పూర్తి చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కళాశాల ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. మంచిర్యాలలోని టూ టౌన్ సమస్య తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ట్రాఫిక్ సమస్య తీర్చిందని వెల్లడించారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో జన్ ధన్ ఖాతల్లో 1500 రూపాయలు జమ చేసి వారికి అండగా నిలిచిన ఘనత నరేంద్ర మోదీదే అన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేద ప్రజలకు ఇప్పుడు ఇస్తున్న 5కేజీల బియ్యానికి అదనంగా మరొక 5కేజీలు బియ్యం రెండు సంవత్సాల నుండి పేద ప్రజలకు దేశ వ్యాప్తంగా ఉచితంగా అందజేస్తున్నారన్నారు. దేశ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలు చిట్టచివరి అందించడం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణలో కూడా ఈ టిఆర్ఎస్ నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి బిజెపి ని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పెద్దపెల్లిపురుషోత్తం,అరుముళ్లపొషం,రజినిష్జైన్,మునిమంద రమేష్,తమ్మిడీ శ్రీనివాస్,మాసురజిని,వంగపల్లి వెంకటేశ్వర్రావు,జోగుల శ్రీదేవి,పట్టి వెంకటకృష్ణ,ముదాంమల్లేష్,అమిరిశెట్టిరాజు,బల్లరమేష్,పల్లిరాకేష్,తోటతిరుపతి,లత పాల్గొన్నారు