చెన్నూరులో మంత్రుల పర్యటనలు

మంచిర్యాల : ఈ నెల 10, 15 తేదీల్లో చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వివరాలకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు. ఈ నెల 10న బీసీ సంక్షేమ & పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్యాతనపల్లి, రామకృష్ణాపూర్ లో ఉదయం 10 గంటలకు సింగరేణి ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం 11 గంటలకు MNR గార్డెన్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కాపు కుల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా రాజ్యసభకు ఎంపికైన ఎంపీ వద్దిరాజురవిచంద్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిఠల్ కి జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
15న చెన్నూరు నియోజకవర్గం లోని గంగారం (రూ.1.97 కోట్లు),కిష్టంపేట(రూ.3.50 కోట్లు ),తుంతుంగ బ్రిడ్జ్ (రూ.8కోట్లు ),సుబ్బరాంపల్లి బ్రిడ్జ్ (రూ.4.80 కోట్లు),రూ.10 కోట్లతో సుద్దాలవాగుపై నిర్మించే బ్రిడ్జి పనులకు రోడ్లు & భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా సోమవారం హైదరాబాదులో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లిదివాకర్, బెల్లంపల్లి శాసనసభ్యులు చిన్నయ్యతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.