టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న

మంచిర్యాల : కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో యాజ‌మాన్యం మొండి వైఖ‌రి విడ‌నాడాల‌ని తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్య‌క్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో గోలేటీ వ‌ర్క్‌షాపులో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గోలేటీ ఏరియా వర్క్ షాప్ లో సంవత్సరం కింద‌ట‌ బైక్ షెడ్డు నిర్మించార‌ని తెలిపారు. దానికి పైకప్పు రేకులు ఇంతవరకు వేయలేదన్నారు. ఆందోళ‌న విష‌యం తెలుసుకున్న అధికారులు డీజీఎం సతీష్ బాబు, సివిల్ డీజీఎం శివరామిరెడ్డి వచ్చి వారం రోజులలో స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చ‌రు. ఏరియా వర్క్ షాప్ లోని షెడ్ కు రేకులతో పైకప్పు వేస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో షెడ్డు కు రేకులు వేయాలని లేక‌పోతే మళ్ళీ ధర్నా చేస్తామ‌ని టీబీజీకేఎస్ హెచ్చ‌రించారు. అధికారుల హామీ మేర‌కు ధర్నా విర‌మించారు. కార్య‌క్ర‌మంలో చీఫ్ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌. ప్రకాష్ రావు, జీఎం కమిటీ స‌భ్యుడు మారిన వెంకటేష్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమారస్వామి, వర్క్ షాప్ అసిస్టెంట్ కార్యదర్శి ఎం.చంద్రయ్య, ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ లక్ష్మి నారాయణ, గ్యారేజ్ యాక్టింగ్ చార్జెండ్ రసూల్, మెకానికల్ చార్జెండ్ దాసు. సేఫ్టీ కమిటీ సభ్యులు తిరుపతి, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like