TRS నేతల బహిష్కరణ
భార్య, భర్తతో సహా ఒక జర్నలిస్టుపై అకారణంగా దాడికి పాల్పడిన నలుగురుTRS నేతలను పార్టీ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఉదయ్ నగర్ లో ఇంటి ముందు, నిలిపి ఉన్న మోటర్ సైకిళ్ళను 10వ డివిజన్ కార్పోరేటర్ అడ్డాలగట్టయ్య కారుతో ఢీ కొట్టాడు. ఇదేమింటని ప్రశ్నించిన ఇంటి యాజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి ని అతని భార్య ప్రమిద కుమారిపై కార్పోరేటర్ అతని అనుచరులు దాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన పాత్రికేయుడు కుమార్, సిఐటియు నాయకుడు మెండ శ్రీనివాస్పై కూడా దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న నలుగురు ఇంట్లో చొరబడి, బూతులు తిడుతూ దాడికి దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపధ్యంలో గోదావరిఖనిలో జర్నలిస్టు పై దాడిని పెద్దపెల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఖండించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినా, ప్రజా జీవనాన్ని భంగం కలిగించేలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దాడికి పాల్పడ్డ కార్పోరేటర్ అడ్డాల గట్టయ్య,
కార్పోరేటర్ భర్త ధరణిజలపతి, TBGKS నేత
పొలాడి శ్రీనివాసరావుని టిఆర్ఎస్ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించారు.