ఆమె అమ్మనే..
ఖాకీ డ్రెస్ వేసుకున్నా.. కలెక్టర్ అయినా.. ఆమె అమ్మనే… తాను ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆమెకు అమ్మతనం గుర్తుకు వస్తుంది.
ఆదివారం తెలంగాణవ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభ్యర్థులు పరీక్ష రాశారు. చాలా మంది పిల్ల తల్లులు సైతం ఈ పరీక్ష రాసిన వారిలో ఉన్నారు. టెట్ రాసే పలువురు మహిళా అభ్యర్థులుతమ పిల్లలను ఎత్తుకునేందుకు బంధువులను వెంట తీసుకువెళ్లారు. మహబూబ్‌నగర్‌లోని సెంటర్ వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ తన విధులు నిర్వహిస్తూనే తన మాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్నారి ఊయల్లో ఉండటంతో ఆ పాపను ఎత్తుకుని పాలు తాగించారు.
రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తల్లులతో పాటు వారి అత్త, అక్క, చెల్లి కుటుంబ సభ్యులు తోడుగా వచ్చారు. కొన్ని చోట్ల ఏకంగా బయట చెట్లకు చీరను ఉయ్యాల లాగా కట్టి వారిని పడుకోబెట్టారు. ఏది ఏమైనా అమ్మతనం ముందు అన్నీ బలాదూరే అని మరోసారి నిరూపణ అయ్యింది.