కార్మికులు TBGKS వైపే..

సింగ‌రేణి కార్మికులు త‌మ‌కు చేసిన మేలు ఎప్పుడు మ‌రిచిపోర‌ని, వారంతా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం వైపేన‌ని టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం RK-6లో నిర్వ‌హించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చొర‌వ‌తో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశామ‌ని గుర్తు చేశారు. టీబీజీకేఎస్ గెలిచాకే ఎన్నో హ‌క్కులు సాధించామ‌న్నారు. కోల్ ఇండియాలో లేనివి కూడా ఇక్క‌డ అమ‌లు అవుతున్నాయ‌ని తెలిపారు. కొన్ని జాతీయ కార్మిక సంఘాలు ప‌నిగట్టుకుని అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు చేస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాజ‌కీయ జోక్యం వ‌ల్ల‌నే కార్మికుల‌కు న్యాయం జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. జాతీయ సంఘాలు చెప్పే మాటలను నమ్మకుండా కార్మికుల కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఆదరించాలని TBGKS వైపే ఉండాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన సమావేశంలో కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి,ఏరియా చర్చల ప్రతినిధులు పెట్టం లక్ష్మణ్,వెంగల కుమారస్వామి,దొమ్మేటి పోశెట్టి,ఏరియా నాయకులు జగదీశ్వర్ రెడ్డి,అడ్డు శ్రీనివాస్,లాగల శ్రీనివాస్,సమ్మిరెడ్డి,అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ ఇప్పభూమయ్య,నాయకులు పొగకు రమేష్,అన్వేష్ రెడ్డి,కంకట వెంకటరాజం,మేడారపు సత్తయ్య,సికొండ రాజయ్య,గోల్కొండ లక్ష్మీనారాయణ,బన్నవెంకటి,యువ నాయకులు గొల్ల సంతోష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like