ఎస్ఐ చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి
రాజ్‌భవన్ ముట్టడి రణరంగం
సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో దానిని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ రణరంగంగా మారింది.కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
కాంగ్రెస్ నిరసనలు అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులపై మాజీ ఎంపీ రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఆమెకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు చుట్టుముట్టడంతో ఫైర్ అయ్యారు. మహిళను మహిళలే అరెస్టు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఓ ఎస్‌ఐ చొక్కా పట్టుకున్నారు. వదలకుండా అలాగే పట్టుకోవడంతో ఆమె చేతిని విడిపించడం చాలా కష్టంగా మారింది. చివరకు మహిళా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమె చేతిని వదిలించాల్సి వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనకారులు ఓ ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం బద్దలుకొట్టారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడి, భట్ట విక్రమార్క, రేణుకా చౌదరితో పాటు పలువుర్ని రాజ్‌భవన్‌కు వెళ్లకుండా పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.